సమాజంలోని పౌరులంతా దేశ భద్రత, అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామ్ ఎస్5 చిత్రం కోసం ఆలపించిన ఐయామ్ ఇండియన్ ప్రత్యేక గీతాన్ని సైబరాబాద్ కమిషనరేట్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్5 చిత్ర బృందానికి సజ్జనార్ అభినందనలు తెలిపారు. పౌరులంతా ఈ వినాయక చవితికి సీడ్ గణేశులను ప్రతిష్టించి పర్యావరణ హితం కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్యనటుడు అలీతోపాటు నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు సన్ని పాల్గొన్నారు.