ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Trains cancelled today: ప్రయాణికులకు విజ్ఞప్తి.. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అవేంటంటే..? - ఆంధ్రప్రదేశ్​లో కురుస్తోన్న వర్షాలు

రాష్ట్రం​లో కురుస్తోన్న వర్షాల(rains in andhra pradesh)తో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం(train interruptions today) ఏర్పడింది. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాలపై నీళ్లు వచ్చి చేరాయని, మరికొన్ని ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులకు గురైందని రైల్వేశాఖ(South Central Railway) వెల్లడించింది. ట్రాక్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని... వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేశాఖ పేర్కొంది. దీంతో ద.మ.రైల్వే పరిధిలో పలు రైళ్లను పూర్తిగా రద్దు(trains cancelled today) చేశామని, కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు(trains temporarily cancelled) చేశామని, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

several-train-services-cancel-due-to-heavy-rainfall-in-andhra-pradesh
ప్రయాణికులకు విజ్ఞప్తి.. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అవేంటంటే..?

By

Published : Nov 22, 2021, 7:13 AM IST

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల(heavy rainfall in andhra pradesh) కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు(trains cancelled today) చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో 172 రైళ్లను పూర్తిగా రద్దు(trains cancelled today) చేసింది. 29 రైళ్లను పాక్షికంగా(trains temporarily cancelled), 108 రైళ్లను దారి మళ్లించినట్టు(Diversion of Trains) దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటితో పాటు 5 రైళ్లను రీ-షెడ్యూలింగ్ చేశామని.. రెండు రైళ్లను షార్ట్ టర్మినేషన్ చేశామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా గుంతకల్ డివిజన్​లోని నందలూరు- రాజంపేట్ సెక్షన్, రేణిగుంట- పూడి సెక్షన్, తనకల్ల- ములకలచెరువు, ధర్మవరం- పాకాల సెక్షన్​లతో పాటు విజయవాడ డివిజన్​లోని నెల్లూరు- పడుగుపాడు సెక్షన్​లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని రైల్వే శాఖ తెలిపింది.

రద్దైన రైలు సర్వీసులు..

చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్, కాచిగూడ- చెంగల్​పట్టు, చెన్నై సెంట్రల్- ఎల్టీటీ ముంబయి, చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్, మధురై- ఎల్టీటీ ముంబయి, రేణిగుంట-గుంతకల్, తిరుపతి- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్- తిరుపతి, గుంతకల్- తిరుపతి, చెన్నై సెంట్రల్- విజయవాడ, చెన్నై సెంట్రల్ -హైదరాబాద్, గూడూరు- విజయవాడ, నర్సాపూర్- ధర్మవరం, కాకినాడ టౌన్- కేఎస్​ఆర్ బెంగళూరు, గూడూరు- సికింద్రాబాద్, లింగంపల్లి- తిరుపతి, హైదరాబాద్​- తంబరం, సికింద్రాబాద్- గూడూరు, తిరుపతి- కరీంనగర్, చెన్నై- ఎగ్మూర్- జోధ్​పూర్, చెంగల్ పట్టు- కాకినాడ పోర్ట్, చెన్నై సెంట్రల్- బిత్రగుంట, చెన్నై సెంట్రల్- చప్ర, చెన్నై సెంట్రల్- న్యూదిల్లీ, చెన్నై సెంట్రల్- హౌరా, కోబ్రా- కోచువెల్లి, కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ- కాకినాడ టౌన్, తిరుపతి - నిజామాబాద్, తిరుపతి- కొల్లాపూర్, కడప- విశాఖపట్నం, చిత్తూరు- కాచిగూడ, హౌరా- యశ్వంత్​పూర్, వాస్కోడిగామా- హౌరా, కాచిగూడ- వాస్కోడిగామా, ఎర్నాకులం- హెచ్​ నిజాముద్దీన్, రేణిగుంట- కాకినాడ పోర్ట్, మధురై- హెచ్​నిజాముద్దీన్, టాటా- ఎర్నాకులం, త్రివేండ్రం- సికింద్రాబాద్, నాగర్​సోల్-ముంబయి సీఎస్​ఎంటీ, తిరుపతి- భువనేశ్వర్, తిరుపతి- బిలాస్​పూర్, విశాఖపట్నం- కడప, చిత్తూరు- కాచిగూడ, కాకినాడ టౌన్- బెంగళూరు, ఆదిలాబాద్- హెచ్​ఎస్​ నాందేడ్, రామేశ్వరం- భువనేశ్వర్ తదితర రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details