విశాలాంధ్ర మాజీ ఎడిటర్,సీనియర్ జర్నలిస్టు చక్రవర్తుల రాఘవాచారి అనారోగ్యంతో కన్నుమూశారు.తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.ఆయన పార్థివదేహాన్ని హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయానికి తరలించారు.రాఘవాచారి భౌతికకాయానికి సీపీఐ నేతలు నారాయణ,చాడా వెంకట్‌రెడ్డి సహా ప్రముఖులు నివాళులు అర్పించారు.సాయంత్రం విజయవాడలో చక్రవర్తుల రాఘవాచారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాఘవాచారి....అనంతరం30ఏళ్ల పాటు విశాలాంధ్ర సంపాదకులుగా పనిచేశారు.సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా,సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగానూ ఆయన సేవలందించారు.రాఘవాచారి మృతిపట్ల సీపీఐ నేత రామకృష్ణ సంతాపం తెలిపారు.సాయంత్రం విజయవాడ విశాలాంధ్ర కార్యాలయం నుంచి ఆయన అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.