జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని అధికారులకు బుధవారం ఎస్ఈసీ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించాలని భావించారు. ఇందులో పాల్గొనాలని సీఎస్ నీలం సాహ్నీకి ఎస్ఈసీ సూచించారు.
సీఎస్ అభ్యంతరంతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ రద్దు
ap sec
15:22 November 18
ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదన్న సీఎస్
అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని ఎస్ఈసీ లేఖపై సీఎస్ నీలం సాహ్నీ సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయింది.
ఇదీ చదవండి
Last Updated : Nov 18, 2020, 3:55 PM IST