ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PETROL ATTACK: ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన సర్పంచ్‌ - అమరావతి వార్తలు

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఓ ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్‌ దాడి జరిగింది. మంటలార్పిన సహోద్యోగులు ఆయనను భైంసాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

petrol ATTACK  by surpanch
ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌తో దాడి

By

Published : Jul 13, 2021, 8:20 PM IST

ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌తో దాడి

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండల కేంద్రంలో ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్‌తో దాడి జరిగింది. ఉపాధి హామీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయక అధికారి రాజుపై పాతసాల్వి సర్పంచ్ సాయినాథ్‌ పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు. రాజుపై ఈ దాడితో చుట్టూ ఉన్న అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్‌ సాయినాథ్‌ అధికార పార్టీకి చెందినవారని స్థానికులు తెలిపారు.

సాల్వి గ్రామంలో ఓ పని విషయమై సంతకం పెట్టాలని సర్పంచ్ కోరడంతో రాజు నిరాకరించినట్లు తెలుస్తోంది. అధికారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడం వల్ల గాయాలయ్యాయి. కార్యాలయంలో కొన్ని దస్త్రాలు కాలిపోయాయి. తోటి ఉద్యోగులు మంటలు ఆర్పి.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. భైంసాలోని ఓ ఆస్పత్రిలో రాజు చికిత్స పొందుతున్నారు. ఈ ఘనటపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజు వద్దకు వచ్చి వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details