ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Samantha: సమంత మీరెప్పుడైనా ఆ పని చేశారా?.. నెటిజన్‌కు సామ్‌ దిమ్మతిరిగే సమాధానం - రీప్రొడ్యూస్‌

సోషల్‌మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సమంత.. తన పర్యటనకు సంబంధించిన వివరాలను, చేసే సాహసాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ‘ఏదైనా అడగండి.. సమాధానం ఇస్తా’ అంటూ ఇన్‌స్టా వేదికగా కోరగా, పలువురు అభిమానులు వరుస ప్రశ్నలు వేశారు. ఓ ఆకతాయి నెటిజన్‌ ‘మీరు ఎవరినైనా పుట్టించారా?(రీప్రొడ్యూస్‌), ఎందుకంటే నేను మీతో రీప్రొడ్యూస్‌ చేయాలనుకుంటున్నా’ అని ప్రశ్నించగా.. నెటిజన్‌కు సామ్‌ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

Samantha news troll in social media
Samantha news troll in social media

By

Published : Feb 22, 2022, 7:45 PM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సమంత(Samantha). నాయికా ప్రాధాన్యం, భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఇక సోషల్‌మీడియాలోనూ సమంత చురుగ్గా ఉంటుంది. తన పర్యటనకు సంబంధించిన వివరాలను, చేసే సాహసాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ‘ఏదైనా అడగండి.. సమాధానం ఇస్తా’ అంటూ ఇన్‌స్టా వేదికగా కోరగా, పలువురు అభిమానులు వరుస ప్రశ్నలు వేశారు. ఓ ఆకతాయి నెటిజన్‌ ‘మీరు ఎవరినైనా పుట్టించారా?(రీప్రొడ్యూస్‌), ఎందుకంటే నేను మీతో రీప్రొడ్యూస్‌ చేయాలనుకుంటున్నా’ అని ప్రశ్నించగా, ‘రీప్రొడ్యూస్‌ అంటే ఏంటో ఒక వాక్యంలో చెప్పగలవా? ముందు ఆ పదానికి గూగుల్‌ చేయాల్సింది’ అంటూ సమాధానం ఇచ్చింది.

దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలకు సామ్‌ సమాధానం ఇచ్చింది. బెన్‌ బోహ్మర్‌, రాబ్‌ మూసేల ‘హోమ్‌’ తన ఫేవరెట్‌ సాంగ్‌ అని, తనకు కామెడీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ గుర్తుండిపోవటమే తన జీవిత లక్ష్యమని తెలిపింది. మీరు బాగానే ఉన్నారా? అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా, ‘అలా అడిగినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా’ అని సమాధానం ఇచ్చింది. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో పాటు, ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి:'భీమ్లానాయక్'​తో పోటీ నుంచి తప్పుకొన్న వరుణ్​తేజ్ 'గని'

ABOUT THE AUTHOR

...view details