రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను చట్టపరంగా ఆ పదవి నుంచి ఏవిధంగా తొలగించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఎన్నికల ఖర్చు తగ్గించేందుకే ఏకగ్రీవాలను ప్రోత్సహించినట్లు ఆయన వివరించారు. కేంద్రానికి రాసిన లేఖపై కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోపణలు, ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ చేతలు ఒకేలా ఉన్నాయని ఆరోపించారు. ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రమేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: సజ్జల - latest updates of ap local elections
ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ రాజీనామా చేయాలని... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను పోటీ చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.
sajjala-ramakrishna-reddy-on-sec-letter-issue