"బాదుడే బాదుడు" కార్యక్రమం పేరిట ప్రభుత్వంపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేసే ఆరోపణలు, విమర్శలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్‌కే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వంపై తెదేపా లేనిపోని ఆరోపణలు చేస్తోంది : సజ్జల - sajjala latest news
చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. "బాదుడే బాదుడు" పేరిట ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును క్విట్ చేసి.. ప్రజలు రాష్ట్రాన్ని సేవ్ చేశారని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో విధించిన పన్నులన్నీ చంద్రబాబు వారసత్వంగా ఇచ్చిపోయివేనని.. తాము కొత్తగా వేసిన పన్నులను ప్రజలకు వివరించి అమలు చేస్తున్నామని సజ్జల తెలిపారు. పన్నులపై వచ్చిన ప్రతి పైసానూ.. ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నామన్నారు. ఏపీలో అమలు చేసినట్లుగా తెలంగాణలోనూ "నాడు నేడు" పథకాన్ని అమలు చేస్తున్నారని, ఇక్కడితో సమానంగా పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దీనికోసం ఏపీ కంటే తెలంగాణ రెండింతలు బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు సభలకు జనాన్ని తీసుకొస్తున్నారన్న సజ్జల.. బాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేసి.. రాష్ట్రాన్ని సేవ్ చేశారని అన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం : చంద్రబాబు