ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

rythu bandhu funds : నేటి నుంచి యాసంగి రైతుబంధు సాయం పంపిణీ - తెలంగాణలో రైతుబంధు 2021

rythu bandhu funds : తెలంగాణలో యాసంగి రైతుబంధు సాయం నేటి నుంచి రైతులకు అందనుంది. ఎకరా భూవిస్తీర్ణంలోపు ఉన్న వారి ఖాతాల్లో ఇవాళ నగదు జమకానుంది. రోజూ ఎకరా చొప్పున పెంచుకుంటూ ఆరోహణా క్రమంలో రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ సీజన్ రైతుబంధు సాయంతో... మొత్తం రైతుబంధు సాయం 50 వేల కోట్లను దాటనుంది.

rythu bandhu
rythu bandhu

By

Published : Dec 28, 2021, 4:43 AM IST

rythu bandhu funds : యాసంగిలో పంటల పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రైతులకు ఇవాళ్టి నుంచి రైతుబంధు చెల్లింపులు జరగనున్నాయి. ఈ సీజన్​ పంట సాగు కోసం ఎకరాకు ఐదు వేల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనుంది. రైతుబంధు చెల్లింపుల కోసం డిసెంబర్ పదో తేదీని కటాఫ్ తారీఖుగా నిర్ణయించారు. ఆ రోజు వరకు ధరణి పోర్టల్ నందు ఉన్న వ్యవసాయ భూముల పట్టాదారులు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద పట్టాలు పొందిన వారికి ఈ సీజన్​లో పంట పెట్టుబడి సాయం అందనుంది.

ఎకరాకు రూ.5వేల చొప్పున..

94 వేల మందికి చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ప్రకారం ఉన్న 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం ఇస్తారు. మొత్తంగా ఈ సీజన్​లో 66.61 లక్షల మంది రైతులుకు చెందిన కోటి 52 లక్షల 91 వేల ఎకరాలకు సాయం అందిస్తారు. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున 7,645 కోట్ల 66 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది వానాకాలం సీజన్​లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్​లో లబ్ధిదారుల సంఖ్య 66.61 లక్షలకు పెరిగింది. వారికి రూ.7,645 కోట్లకు పైగా సాయం అందనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి యాసంగి సీజన్ రైతుబంధు చెల్లింపులు చేస్తారు.

ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఆరోహణ క్రమంలో..

తక్కువ భూవిస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి ఆరోహణా క్రమంలో సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఇవాళ ఒక ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఒక ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతారు. మంచిరోజు అన్న ఉద్దేశంతో శుక్రవారం రోజే పది మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. వచ్చే నెల మొదటి వారంలో రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది.

నిధులు సమకూర్చుకుంటోన్న ఆర్థిక శాఖ

రైతుబంధు చెల్లింపుల కోసం అవసరమైన మొత్తాన్ని ఆర్థికశాఖ సమకూర్చుకుంటోంది. ఖజానాకు వచ్చే ఆదాయంతో పాటు రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తాన్ని ఇందుకు వినియోగించనుంది. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు రూ.5500 కోట్లు అప్పుగా తీసుకొంది. గత సీజన్ వరకు ఏడు దఫాలుగా రైతుబంధు చెల్లింపులు చేశారు. పథకం కింద ఇప్పటి వరకు 43,036.63 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చింది. ఈ సీజన్ లో మరో 7645 కోట్ల చెల్లింపులు చేయనున్నారు. దీంతో రైతుబంధు సాయం 50 వేల కోట్ల రూపాయల మార్కును అధిగమించనుంది.

ఇదీ చూడండి :CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details