ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RTC CHARGES: 'బస్సు వద్దు.. రైలే ముద్దు' అంటున్న ప్రయాణికులు - RTC CHARGES HIKE IN AP

RTC CHARGES: ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సగటు ప్రయాణికుడిపై పెను భారం పడింది. ఛార్జీల వడ్డనతో బస్సెక్కేందుకు జనం జంకుతున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళదామంటే అక్కడా అదే పరిస్ధితి. దీంతో చౌక ధరలో ప్రయాణం కోసం జనం రైళ్లను ఆశ్రయించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రైల్వేస్టేషన్లలో రద్దీ పెరగడంతో పాటు.. రిజర్వేషన్లలోనూ వెయిటింగ్ లిస్టు భారీగా దర్శనమిస్తోంది.

RTC CHARGES
RTC CHARGES

By

Published : Jul 11, 2022, 3:38 PM IST

"బస్సు వద్దు.. రైలే బెస్టు" అంటున్న ప్రయాణికులు

RTC CHARGES:బస్సు ఛార్జీల బాదుడుతో ప్రయాణికులు హడలి పోతున్నారు. ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటర్ల ప్రకారం డీజిల్ సెస్‌ వడ్డించడంతో.. ఛార్జీలు భారీగా పెరిగాయి. మూడేళ్లలో 3 సార్లు ఛార్జీలు పెంచడం.. ప్రయాణికులకు పెను భారంగా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్ 11న తొలిసారి ఛార్జీలు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న రెండోసారి.. మళ్లీ 3 నెలలు తిరక్కముందే ఈనెల 1న మూడోసారి ఛార్జీలు వడ్డించారు. మొత్తంగా మూడేళ్లలోనే ఏడాదికి 2 వేల కోట్ల రూపాయల చొప్పున ప్రయాణికుల నుంచి ఆర్టీసీ పిండుతోంది. ఛార్జీల మోతతో ప్రయాణికులు బస్సులకు వెళ్లేందుకు జంకుతున్నారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులూ ఛార్జీలను పెంచేశారు. ఆటోలు, టాక్సీలు, క్యాబ్‌లలోనూ ఇదే పరిస్థితి. ఎటు వెళ్లాలన్నా జేబులు ఖాళీ అయ్యే పరిస్థితిలో.. జనం రైళ్ల వైపు మొగ్గుతున్నారు. మూడేళ్ల కిందట బస్సులో ప్రయాణానికి.. రైలుకి మధ్య ఛార్జీల తేడా స్వల్పంగా ఉండేది. ప్రస్తుతం ఆ వ్యత్యాసం భారీగా ఉండడంతో.. జనం రైళ్లకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు మాత్రం ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. కొద్దిరోజులుగా ఆక్యుపెన్సీ రేషియో భారీగా తగ్గిపోయింది.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సులో వెళ్లితే 513 రూపాయలు అవుతుంది. అదే రైలులో స్లీపర్ బెర్తులో వెళితే 255 రూపాయలు మాత్రమే. రైలులో కంటే బస్సు ఛార్జీ 258 రూపాయలు ఎక్కువ. అదే ఇంటర్ సిటీ రైలులో సెకండ్ సీటింగ్​లో వెళ్తే ఛార్జీ కేవలం 155 రూపాయలే. రైలు ఛార్జీలతో పోల్చితే బస్సులో 358 రూపాయలు ఎక్కువ. విజయవాడ నుంచి తిరుపతికి సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీ 761 రూపాయలు ఉండగా.. అదే రైలులో రూ.275 మాత్రమే. బస్సు కంటే రైలులో 486 రూపాయలు తక్కువ. కర్నూలు, అనంతపురం, రాజమహేంద్రవరం.. ఇలా దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సులు వదిలి రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

రాష్ట్రం నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలకు రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఇప్పుడు రైళ్లలో వెళ్తున్నారు. సూపర్ లగ్జరీ నాన్ ఎసీ బస్సులో చెల్లించే ధరతో.. దర్జాగా రైలులో ఎసీ బెర్తులో ప్రయాణిస్తున్నారు. గతంలో పండుగలు, ప్రత్యేక రోజుల్లో ప్రయాణానికి 3 నెలల ముందే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయేవి. ఇప్పుడు వారం నుంచి 15 రోజుల్లోనే బెర్తులన్నీ బుక్‌ అవుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నెలరోజుల ముందే రిగ్రేట్ దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో టికెట్లు బుక్ చేసుకునేందుకూ ఆవకాశం లేకుండా ఉంది. అత్యవసర ప్రయాణమైతే తప్ప.. మిగిలిన వారంతా రైళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details