ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సాధ్యమైనంత త్వరగా విచారించండి'

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయాల్సి ఉన్నా.. అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదని.. న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీని వల్ల ఏటా లక్షల్లో విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. ఈ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని కోరారు.

high court
హైకోర్టు

By

Published : Jul 30, 2021, 6:33 AM IST

విద్యా హక్కు చట్టంలోని నిబంధన ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయాల్సి ఉన్నా.. అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదని.. న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 25 శాతం సీట్లను భర్తీ చేయకపోవడం వల్ల లక్షల సంఖ్యలో పేద విద్యార్థులు ఏటా నష్టపోతున్నారని తెలిపారు. ఈ అంశం ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని... సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది

ABOUT THE AUTHOR

...view details