కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైకోర్టులో తుది తీర్పు వచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఐకాస నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరూ హామీ ఇచ్చారని తెలిపారు. తీర్పు కాపీని పరిశీలించి, న్యాయమూర్తులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్మికులు అధైర్యపడొద్దన్నారు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి - ts rtc strike
తెలంగాణ హైకోర్టులో తుది తీర్పు వచ్చేవరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఐకాస నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరూ హామీ ఇచ్చారని తెలిపారు.
rtc-strike-contiue-upto-h