Accident: న్యూ ఇయర్ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి - crime news in telangana
15:30 January 01
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
Road accident: నూతన సంవత్సర వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంతా ఆనందంగా ఉండగా.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. కారు, ద్విచక్రవాహనం ఢీకొని నలుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు(28), శ్రావణి(22) దంపతులు తమ కుమార్తె అమ్ములు(8 నెలలు)తో కలిసి ద్విచక్రవాహనం మీద వెళ్తున్నారు.
అదేసమయంలో.. జహీరాబాద్- బీదర్ రహదారిపై వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25) కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. పల్టీలు కొడుతూ వచ్చి.. బాలరాజు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా.. బాలరాజు దంపతులు, కారులోని ఫరీద్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి :