ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న జ్వరాలు.. నిర్ధారణే అసలైన పరీక్ష

Fevers: రాష్ట్రంలో నానాటికీ జ్వరాలు పెరిగిపోతున్నాయి. అయితే నిర్ధారణే అసలైన పరీక్షగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీ కిట్‌ల కొరత వేధిస్తోంది. బాధితులకు ఆందోళన తప్పడంలేదు.

Fevers
నిర్ధారణే అసలైన పరీక్ష

By

Published : Sep 14, 2022, 10:24 AM IST

Fevers: రాష్ట్రవ్యాప్తంగా జ్వరపీడితులు నానాటికీ పెరుగుతున్నారు. డెంగీ అనుమానిత లక్షణాలు కలిగిన వారికి కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షల్ని అరకొరగా చేస్తున్నారు. కొందరు బాధితులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు కేంద్రాలకు వెళ్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వైరస్‌ శరీరంలో ఉందా? లేదా? డెంగీ కిట్‌ ద్వారా గుర్తిస్తారు. వైరస్‌ ఉన్నట్లు తేలితే తుది నిర్ధారణకు ఎలీసా అనే మరో పరీక్ష చేస్తారు. ఎలీసా సౌకర్యం పరిమిత కేంద్రాల్లోనే ఉన్నందున రోగులు అవస్థలు పడుతున్నారు.

రోగుల రద్దీ ఎక్కువగా ఉండే చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎలీసా పరీక్షల్ని చేయడం లేదు. నంద్యాల జిల్లా ఆసుపత్రిలో డెంగీ నిర్ధారణ కిట్‌లు నిండుకున్నాయి. ఇక్కడికి వచ్చేవారికి నేరుగా ఎలీసా పరీక్ష చేస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే 19 కేసులు ఇక్కడ నమోదవడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. నంద్యాల జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శేషారత్నంను వివరణ అడగ్గా కిట్‌లు ఈ మధ్యనే వచ్చాయన్నారు. నంద్యాలలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఎవరికైనా ప్లేట్‌లెట్‌లు అవసరమైతే కర్నూలు పంపిస్తున్నామన్నారు. ఆదోని ఏరియా ఆసుపత్రి పరిధిలో రోజుకు 3-4 మంది జ్వరబాధితుల నుంచి రక్త నమూనాల్ని సేకరిస్తున్నారు. ఇలా నాలుగు రోజులు సేకరించి ఒకేసారి 20 నమూనాల్ని పరీక్షిస్తున్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో వారం వ్యవధిలో 87 డెంగీ కేసులు నమోదయ్యాయి. తెచ్చిన కిట్‌లు అయిపోవడంతో ఎలీసా పరీక్షలే చేస్తున్నారు.

యంత్రాల్ని పక్కన పెట్టేశారు:బాపట్ల జిల్లాలో చీరాల వైద్యశాలే పెద్దది కావటంతో ఇక్కడకు చీరాల, పర్చూరు నియోజకవర్గాల రోగులతోపాటు బాపట్ల నుంచీ చికిత్స కోసం వస్తుంటారు. రోజుకు 400 వరకు ఓపీ నమోదవుతుంది. వీరిలో జ్వరాలతో బాధపడేవారు సుమారు 50 మంది వరకు ఉంటారు. డెంగీ తుది నిర్ధరణలో కీలకమైన యంత్రం(సెల్‌కౌంటర్‌)ను ఉపయోగించే నైపుణ్యం సాంకేతిక సిబ్బందికి భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో రెండు నెలలుగా డెంగీ నిర్ధారణ కిట్‌లే లేవు. అనుమానిత లక్షణాలు కలిగిన వారు 50 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రం పార్వతీపురం వెళ్లాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 3 వేల డెంగీ కిట్‌లను ఆసుపత్రులవారీగా కేటాయించారు. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవు. అదనంగా కిట్లు పంపాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి చెప్పారు.

కేజీహెచ్‌ ఒకటే దిక్కు:రాష్ట్రంలోకెల్లా డెంగీ ఎక్కువగా నమోదవుతున్న విశాఖపట్నం జిల్లాలో ఎలిసా పరీక్ష కేంద్రాలు సరిపడా లేకపోవడం విడ్డూరం. కేజీహెచ్‌ ఒక్కచోటే ఎలిసా అందుబాటులో ఉంది. భీమిలి, అగనంపూడి సామాజిక ఆసుపత్రుల్లో ఎలిసా పరీక్ష కేంద్రాల్ని పెట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఇతర చోట్ల:ఎన్టీఆర్‌, కృష్ణా రెండు జిల్లాల వారికి ఎలిసా పరీక్షను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్వహిస్తున్నారు. రోజుకు 20 నమూనాలు పరీక్షల కోసం వస్తున్నాయి. ఫలితాలు వచ్చేందుకు రెండు రోజులకుపైగా పడుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details