ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

rgv: 'నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు' - rgv latest news

rgv: సినిమా టికెట్ల వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ట్విట్టర్​లో మంత్రి పేర్నినాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని...దర్శకుడు రాంగోపాల్ వర్మను చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు స్పందించిన ఆర్జీవీ తనను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు.

rgv
rgv

By

Published : Jan 8, 2022, 12:23 PM IST

rgv: సినిమా టికెట్ల అంశంపై మంత్రులు, వర్సెస్ ఆర్జీవీ అన్నట్టుగా ట్వీట్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పేర్నినానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తోందని ఆశిస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు ఆర్జీవీ.

ఆర్జీవీ చేసిన ఈ విజ్ఞప్తికి.. మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగానే స్పందించారు. "ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం" అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని ఈనెల 10న అపాయింట్​మెంట్ ఇచ్చారు.

దీనిపై స్పందించిన ఆర్జీవీ.. "నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్నినానికి ధన్యవాదాలు.. భేటీలో సినిమా టికెట్ ధరలపైనా నా అభిప్రాయాలు పంచుకుంటా, చలనచిత్రాలు, థీమ్ పార్కులు వినోద సంస్థలు, సంగీత కచేరీలు, మ్యాజిక్ షోలు కూడా వినోద సంస్థల కిందకు వస్తాయి. వాటి టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించలేదు.'' అని ఆర్జీవీ అన్నారు.

ఇదీ చదవండి:

Family suicide at vijayawada : విజయవాడలో.. తెలంగాణ కుటుంబం ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details