రాష్ట్రంలో రెవెన్యూ లోటు రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు నమోదు అవుతోంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో పాటు గ్రాంట్లు, ఇతర ఆదాయాలు, ఘననీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ 16 నాటికి రాష్ట్రంలో రూ.46 వేల 336 కోట్ల రెవ్యెన్యూ వసూళ్లు నమోదయ్యయి.
2018 19 సంవత్సరానికి ఇదే సమయానికి రూ.54వేల 396కోట్లుగా నమోదయ్యింది. పన్నురాబళ్లు, మోటరు వెహికల్పై పన్నులు, వస్తు సేవలపై విధించే పన్నులు, విద్యుత్ ఇతర వస్తువులకు సంబంధించిన పన్నులు, జీఎస్టీ, అబ్కారీ, స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, నాలా పన్నులు, వినోదపు పన్నులు, గనులు ఇలా వివిధ ఆదాయ మార్గాల నుంచి వసూళ్లు ఘననీయంగా తగ్గాయి.