ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 9:36 PM IST

ETV Bharat / city

బ్యాంక్ సమయాలు తగ్గించాలని హోంమంత్రికి వినతి పత్రం

కరోనా నేపథ్యంలో బ్యాంక్ సమయాలను తగ్గించాలని గుంటూరు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు హోంమంత్రి మేకతోటి సుచరితకు వినతి పత్రం అందించారు. ఇప్పటికే కొందరు బ్యాంక్ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి తెలిపారు.

request to home minister to reduce bank timings
బ్యాంక్ సమయాలు తగ్గించాలని హోంమంత్రికి వినతి పత్రం

కరోనా నేపథ్యంలో బ్యాంక్ సమయాలను తగ్గించాలని గుంటూరు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు హోంమంత్రి మేకతోటి సుచరితకు వినతి పత్రం అందించారు. రోజు మార్చి రోజు పనిచేసేలా అవకాశం కల్పించాలని కోరారు. బ్యాంక్ లకు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వస్తున్నారని, కొందరు మాస్క్ లు, భౌతిక దూరం పాటించడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు బ్యాంక్ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారిని అరికట్టడానికి, ప్రజలకు వైరస్ సోకకుండా ఉండాలనే సమాజహితంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ నేతలు పేర్కొన్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత సానుకూలంగా స్పందిస్తూ.. ఈ కరోనా క్లిష్ట సమయంలో బ్యాంక్ ఉద్యోగులు వెలకట్టలేని సేవలు అందిస్తునారని చెప్పారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. హోంమంత్రి స్పందనపై యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆ నలుగురికి.. అమరావతి రైతుల లేఖలు!

ABOUT THE AUTHOR

...view details