ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BALAPUR LADDU: సీఎం జగన్​కు బాలాపూర్ లడ్డూ అందజేత - ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్

హైదరాబాద్​లోని బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్న ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ దానిని నేడు సీఎం జగన్ కు(BALAPUR LADDU TO CM JAGAN) అందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు.

BALAPUR LADDU
BALAPUR LADDU

By

Published : Sep 21, 2021, 8:13 PM IST

వినాయక చవితికి లడ్డు వేలం పాటలో.. హైదరాబాద్​లోని బాలాపూర్​ది ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ప్రతి ఏడాదీ రికార్డు ధరకు గణనాథుని ప్రసాదం వేలం జరుగుతుంది. ఈసారి దానిని ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సొంతం చేసుకున్నారు.

బాలాపూర్ గణేషుడి లడ్డూను వేలం పాటలో రూ. 18.90 లక్షలకు సొంతం చేసుకున్న ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్.. ఆ లడ్డూను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రమేశ్ యాదవ్, అబాకస్ విద్యా సంస్థల అధినేత శశాంక్ రెడ్డి జగన్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్‌లో నిర్వహించిన వేలం పాటలో సొంతం చేసుకున్న లడ్డూను ముఖ్యమంత్రికి ఇరువురూ కలిసి అందించారు.

ABOUT THE AUTHOR

...view details