ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన దసరా పండగ.. ఎంత మెుత్తంలో అంటే..? - ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన దసరా పండగ

Record income for TSRTC: దసరా పండగ... ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రయాణికుల అవసరాలకు తగినట్లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో.. ఆదాయం గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దసరాకు ఆర్టీసీ 195 కోట్ల వరకు రాబడి వచ్చిందని తెలుస్తోంది. ప్రయాణికుల రాకపోకలతో బస్​స్టేషన్లు సందడిగా మారిపోయాయి.

Record income for TSRTC
ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన దసరా పండగ

By

Published : Oct 10, 2022, 3:07 PM IST

Record income for TSRTC: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పండగైన దసరా కోసం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆర్టీసీ 4,198 ప్రత్యేక బస్సులను నడిపించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదు. 15 రోజుల్లో సుమారు రూ.195 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దసరా పండుగ రోజున రూ.6 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది. మిగిలిన రోజుల్లో ప్రతిరోజూ సరాసరిగా రూ.13 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.

అక్టోబర్ 6న 11.09 కోట్లు, 7న 14.91 కోట్లు, 8న రూ.14.97 కోట్లు వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 9న 14.9 కోట్లు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఆర్టీసీకి 56.97 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 10వ తేదీన సోమవారం రోజున పాఠశాలలు, కళాశాలలు సెలవుల తర్వాత పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ ఎత్తున తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఆదాయం కూడా సుమారు రూ.18 కోట్ల వరకు రావచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.

కర్నూలు, విశాఖపట్నం, బెంగుళూరు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 9వ తేదీన బెంగుళూరుకు ఒక్కరోజే 25 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగుళూరుకు తిరిగి వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తిరుపతికి సైతం బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details