ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: యాదాద్రి సాలహారాల్లో రాతి విగ్రహాల పొందిక పనులు - yadadri news

తెలంగాణలోని యాదాద్రి నారసింహుని సన్నిధిలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తర దిశలోని సాలహారాల్లో మరిన్ని రాతి విగ్రహాల పొందిక పనులు చేస్తున్నారు. ఆలయనగరిపై చినజీయర్​ స్వామికి కేటాయించిన భూమిలో ఆశ్రయం నిర్మాణానికి జోరుగా పనులు కొనసాగుతున్నాయి.

Yadadri Reconstruction Works
తెలంగాణ: యాదాద్రి సాలహారాల్లో రాతి విగ్రహాల పొందిక పనులు

By

Published : Apr 2, 2021, 12:36 PM IST

తెలంగాణలోని యాదాద్రి పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానాలయ ఉత్తర దిశలోని సాలహారాల్లో మరిన్ని రాతి విగ్రహాల పొందిక పనులు చేస్తున్నారు. ఉత్తర దిశలో మిగిలి ఉన్న సాలహారాల్లో.. శంఖు, చక్రం, తిరు నామాలు, శ్రీరామ పట్టాభిషేకం, శేషతల్పంపై స్వామి వారు పవళింపు ఆకృతి సహా వివిధ దేవతామూర్తుల విగ్రహాలను అమరుస్తున్నారు.

చినజీయర్ ఆశ్రమం పనులు..

యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ నగరిపై నాలుగేళ్ల క్రితం 1.5 ఎకరం స్థలాన్ని కేటాయించింది. ఆ భూమిలో సుమారు 25 అడుగుల లోతు నుంచి రాతి గోడ పనులు చేపట్టారు. అందులో ఎర్రమట్టిని పోసి చదును చేస్తున్నారు. నేలకు సమాంతరంగా చదును చేసి నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానాలయం ప్రారంభమయ్యే లోపు ఆశ్రమం పూర్తి చేయాలని చినజీయర్ స్వామి సంకల్పంతో ఉన్నారని.. ఆ దిశగా పనులు వేగవంతం చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ అధికారులు తెలిపారు.

ఇవీచూడండి:కదిరిలో వైభవంగా ప్రారంభమైన లక్ష్మీ నరసింహుని రథోత్సవం

ABOUT THE AUTHOR

...view details