ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ట్రాన్స్​ ట్రాయ్​ అవినీతిపై రెండేళ్ల క్రితమే ఫిర్యాదు చేశాం'

రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు అంశం గురించి ఆయన కుమారుడు, తెదేపా నేత రాయపాటి రంగబాబు మీడియాతో మాట్లాడారు. కంపెనీలో అవినీతి విషయమై అధికారులకు రెండేళ్ల క్రితమే ఫిర్యాదు చేశామని చెప్పారు. బ్యాంకు అధికారులు, చెరుకూరి శ్రీధర్ అనే వ్యక్తి కుమ్మకై అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు

rayapati son rangababu react on CBI case over trans trai
rayapati son rangababu react on CBI case over trans trai

By

Published : Jan 3, 2020, 4:55 PM IST


మాజీఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు అంశం గురించి ఆయన తనయుడు రాయపాటి రంగారావు స్పందించారు. గత రెండు రోజులుగా అధికారులు తమ ఇంట్లో సోదాలు చేశారని తెలిపారు. 2004లో మరో ముగ్గురితో కలిసి తమ తండ్రి ట్రాన్స్​ ట్రాయ్​ కంపెనీ ప్రారంభించారని తెలిపారు. తాము రాజకీయాల్లో ఉండడం కారణంగా తమ అమ్మ పేరుతో నడిపించారని చెప్పారు. తర్వాత చెరుకూరి శ్రీధర్ అనే వ్యక్తి కంపెనీ షేర్లు ఆయన పేరు మీద మార్చుకున్నారని వెల్లడించారు.

బ్యాంకు అధికారులతో కలిసి చెరుకూరి శ్రీధర్ కుమ్మకై అవినీతికి పాల్పడ్డారని రంగబాబు ఆరోపించారు. కంపెనీలో అవినీతి విషయమై సంబంధిత అధికారులకు రెండేళ్ల క్రితమే ఫిర్యాదు చేశామని వివరించారు. ప్రధాని, ఆర్థిక మంత్రితోపాటు ఈడీ, సీబీఐకి లేఖలు రాశామని తెలిపారు. ట్రాన్స్ ట్రాయ్ వ్యవహారం కింగ్​ఫిషర్​ కంటే పెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు.

మీడియాతో రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు

ఇదీ చదవండి : మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details