శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి సమ్పర్పించింది. కృష్ణా నదిపై నిర్మించే ఏ ప్రాజెక్టు వివరాలైనా తమకు డీపీఆర్ ఇవ్వాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పేర్కొనడంతో ప్రభుత్వం ఈ వివరాలు సమ్పర్పించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లను జలవనరుల శాఖ ఖరారు చేసింది. రివర్స్ ఆక్షన్ అనంతరం 3,307.07 కోట్లకు బిడ్లును ఖరారు చేశారు. పశ్చిమ బంగాకు చెందిన ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్‌తో కలిసి సుభాష్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. ప్రభుత్వం పిలిచిన ధర కంటే 0.88 శాతం అధికంగా ఈ బిడ్ ఖరారు అయ్యింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయంగా 3,278.18 కోట్లను జలవనరుల శాఖ నిర్ధరించింది. ఎన్‌సీసీతో పాటు నవయుగ కనస్ట్రక్షన్స్ సంస్థలు ఈ బిడ్‌ను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. తొలుత 3,340 కోట్లతో బిడ్ దాఖలు అయ్యింది. రివర్స్ ఆక్షన్ అనంతరం 3,307 కోట్లకు ఖరారు చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల వరద నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం మూడు టీఎంసీల నీటిని సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకూ తీసుకెళ్లేందుకు గానూ అప్రోచ్ ఛానెల్, ఎత్తిపోతల, పంప్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది.పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌లోని బీసీఆర్ కాంప్లెక్స్ వరకూ కాలువ అభివృద్ధి పనుల కోసం మొత్తం 570 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అలాగే ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో 30వేల క్యూసెక్కుల నీటిని గోరకల్లు బాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించేందుకు వివిధ నిర్మాణాల కోసం 939 కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కృష్ణా బోర్డుకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వార్తలు
రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఏపీ జలవనరుల శాఖ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సమర్పించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈపీసీ విధానంలో 3,307.5 కోట్లకు పనులు అప్పగించారు.
కృష్ణా బోర్డుకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్