ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతల పథకం... వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు - Rayalaseema Upliftment Schem latest news

రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేవియట్ దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లు వేసింది. వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు వేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కేవియట్‌లు వేసింది.

Rayalaseema Upliftment Scheme ... Petitions in different courts
రాయలసీమ ఎత్తిపోతల పథకం... వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు

By

Published : Aug 5, 2020, 2:49 PM IST

Updated : Aug 5, 2020, 6:18 PM IST

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే ఏపీ కేవియట్​లు దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేయడంతో పాటు, టెండర్ల ప్రక్రియ ముందుకు వెళ్లకుండా ఏపీని నిరోధించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203లో రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను ఏకపక్షంగా ప్రతిపాదించారని తెలంగాణ ఆరోపించింది. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టును చేపట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని పిటిషన్​లో పేర్కొంది. అటు కృష్ణా బోర్డు కూడా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలంగాణ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​లో పేర్కొంది.

ఇదీ చదవండీ... ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ

Last Updated : Aug 5, 2020, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details