టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరైంది. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించిన కేసులో హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిప్రకాశ్ ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
రవిప్రకాశ్‌కు బెయిల్.. జైలు నుంచి విడుదల
రవిప్రకాశ్ బెయిల్‌పై విడుదలయ్యారు. నకిలీ మెయిల్ ఐడీ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
రవిప్రకాశ్‌కు బెయిల్.
అసలేం జరిగిందంటే..?
ఏబీసీఎల్‌ను రూ.18 కోట్లకు మోసగించిన కేసులో రవిప్రకాశ్ కొన్నిరోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఏబీసీఎల్‌ను మోసం చేసిన కేసులో అదేరోజు సైబరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.