రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకునేదిలేదని మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉందని రావెల ఆరోపించారు. విశాఖ వైద్యుడు సుధాకర్‌పై దాడి నుంచి రాజమహేంద్రవరంలో యువకుడికి శిరోముండనం వంటి ఘటనలే అందుకు నిదర్శనమని అన్నారు.
ఎస్సీలపై దాడులు చేస్తే ఊరుకునేదేలేదు: రావెల
వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ కరవైందని మాజీ మంత్రి, భాజపా నేత రావెల కిశోర్ బాబు ఆరోపించారు. వారిపై దాడులు ఇలానే కొనసాగితే చూస్తూ ఊరుకునేదే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఎస్సీలపై దాడులు కొనసాగితే ఊరుకునేదేలేదు:మాజీమంత్రి రావెల
ఇదే విధంగా కొనసాగితే భాజపా చూస్తూ ఊరుకునేదిలేదని ప్రభుత్వాన్ని రావెల హెచ్చరించారు. . న్యాయవాదులు, జడ్జిలపైనా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కారకులైన అధికారులపై ఏదో కంటితుడుపు చర్యలనే తీసుకుంటోందన్నారు. ఇకనైనా సర్కార్ మేలుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి-'ఇదేమి నియంత రాజ్యం కాదు... ప్రజాస్వామ్యమని గుర్తుంచుకోండి'