భార్యకు దెయ్యం పట్టిందని మంత్రగాడిని ఆశ్రయించాడు ఓ వ్యక్తి. సదురు మాయలోడు ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానంటూ... మహిళపై అత్యాచారం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది . మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మౌలాలీ ఈస్ట్ ప్రగతినగర్లో మహమ్మద్ అజీజ్ కుటుంబం నివసిస్తోంది. కొన్ని రోజులు భార్యకు దెయ్యం పట్టిందని మూఢనమ్మకం పెంచుకున్నాడు. భార్యకు పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు మౌలాలీలోని మంత్రగాడిని ఆశ్రయించాడు. తన భార్యకు మంత్రగాడు ఏం చెప్పినా చేయాలని చెప్పి... వదిలేసి వెళ్లిపోయాడు.
పూజలంటూ...
ఆమెను గదిలోకి తీసుకెళ్లిన ఆ మాయలోడు... కాసేపు పూజలు చేస్తున్నట్టు నటించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కాసేపటికి అక్కడకు చేరుకున్న భర్త... ఏమీ తెలియనట్లు బాధితురాలిని తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక జరిగిన విషయాన్ని భర్తకు చెప్పగా... అతడు దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.
ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... మంత్రగాడిని, బాధితురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి:ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం