Ramineni Foundation Awards 2021: వివిధ రంగాల్లో అత్యద్భుత ప్రతిభ కనబరిచి.. ప్రజలకు మెరుగైన సేవలు అందించిన వారిని పురస్కారాలతో సత్కరించనున్నట్లు రామినేని ఫౌండేషన్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. 2020, 2021 ఏడాదికి విశిష్ఠ, విశేష పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. గతేడాది కరోనా వల్ల అవార్డుల కార్యక్రమం నిర్వహించలేదని అందుకే.. 2020, 2021 సంవత్సరాలకు సంబంధించిన పురస్కారాలు ఒకేసారి ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మప్రచారక్ తెలిపారు.
Ramineni Foundation Awards: నేడు రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం.. ముఖ్యఅతిథిగా సీజేఐ - అమరావతి తాజా వార్తలు
Ramineni Foundation Awards 2021 : వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి.. ప్రజలకు సేవలందించిన వారిని రామినేని ఫౌండేషన్ పురస్కారాలతో సత్కరించనుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవం నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్‌లో జరగనుంది.
Ramineni Foundation Awards 2020 : కరోనా మహమ్మారి కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినందున 2021 ఏడాదికి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు విశిష్ఠ పురస్కారం లభించనుంది. 2020 ఏడాదికి నాబార్డ్ ఛైర్మన్ డా.జి.ఆర్.చింతలకు, 2021కి బ్రహ్మానందం, నిమ్స్ వైద్యురాలు పద్మజకు, 2021కి తెలుగు సినీ జర్నలిస్టు ఎస్.వి.రామారావుకు విశేష పురస్కారం, 2020 ఏడాదికి నటుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం ప్రదానం చేయనున్నారు. 2020కి టీవీ వ్యాఖ్యాత సుమ కనకాలకు, 2020కి హీలింగ్ హస్త హెర్బల్స్ సంస్థ ఎండీ మస్తాన్‌కు, షిర్డీలోని ద్వారకామయి సేవా ట్రస్ట్‌కు చెందిన శ్రీనివాస్‌కు విశేష పురస్కారం అందజేయనున్నారు.