GVL narsimha rao: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, రైతులకు డబ్బులు చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరిపించాలని.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ, వినియోగ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు.. లేఖ రాశారు. ‘ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఏపీ రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వారికి డబ్బుల చెల్లింపు విషయంపై గత శుక్రవారం రాజ్యసభలో నేను వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు అవసరమైన 90% నిధులను కేంద్ర ప్రభుత్వం ముందుగానే రాష్ట్రాలకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. మధ్య దళారులు, రైస్ మిల్లర్లు, అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ధాన్యం సేకరణ కార్యక్రమం ద్వారా డబ్బులు దండుకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు నెలల తరబడి డబ్బులు చెల్లించడం లేదు. దీనిని బట్టి కేంద్రం నుంచి అడ్వాన్సుగా వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతరత్రా పనుల కోసం మళ్లిస్తున్నట్లు స్పష్టమవుతోంది’ అని జీవీఎల్ తన లేఖలో కోరారు. నిధులు కేటాయించకుండా కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
GVL Narsimha Rao: ధాన్యం సేకరణలో అవకతవకలపై దర్యాప్తు జరిపించండి: జీవీఎల్
GVL narsimha rao: రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరిపించాలని.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన లేఖ రాశారు.
ధాన్యం సేకరణలో అవకతవకలపై దర్యాప్తు జరిపించండి: జీవీఎల్ లేఖ