ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 30, 2020, 8:16 AM IST

ETV Bharat / city

స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నేడు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

rains ina andhra pradesh
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణ, ఒడిశా, చత్తీస్​గఢ్ ప్రాంతాల్లో చాలాచోట్ల.. మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నట్టు ప్రకటించింది. నైరుతి రుతుపవనాల తిరోగమనంతో రాగల నాలుగు రోజుల్లో వాయువ్య భారత్​లో పొడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ వెల్లడించింది.

ఇదీ చదవండి: ఏడాది అప్పు ఐదు నెలల్లోనే!

ABOUT THE AUTHOR

...view details