Thundershowers in AP: ఉత్తర అండమాన్ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, మధ్య బంగాళాఖాతం మీద 22వ తేదీ ఉదయానికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Rainfall in AP: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు: వాతావరణ శాఖ
Weather update in AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయని వెల్లడించింది.
మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు
వాయుగుండం మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయని సూచించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి: