ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎక్స్​ప్రెస్​లుగా ప్యాసింజర్ రైళ్లు..?:రైల్వే బోర్డు కసరత్తు - railway board news

ప్యాసింజర్‌ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్నాయి. ప్రయాణదూరం 200కిమీ, ఆపై ఉన్న రైళ్లను గుర్తించి ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చనున్నారు. ఈ మేరకు రైల్వేబోర్డు కసరత్తు ప్రారంభించింది. ఈ నిర్ణయంతో సామాన్య, చిరుద్యోగుల ప్రయాణాలపై అధిక ప్రభావం పడనుంది.

railway-board
railway-board

By

Published : Jun 19, 2020, 9:51 AM IST

ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చే కసరత్తును రైల్వేబోర్డు ప్రారంభించింది. ప్రయాణదూరం 200 కి.మీ, ఆపై ఉన్న రైళ్లను గుర్తించింది. ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చడంతో పాటు అవసరమైన చోట హాల్ట్‌లు తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తక్షణ చర్యలు ప్రారంభించాలని ద.మ.రైల్వే సహా దేశంలోని అన్ని జోన్లకు రైల్వేశాఖ స్పష్టం చేసింది. 19వ తేదీలోగా వివరాలు పంపాలని పేర్కొంది. రైల్వేశాఖ తాజా నిర్ణయంతో సామాన్య ప్రయాణికులు, చిరుద్యోగుల ప్రయాణాలపై అధిక ప్రభావం పడనుంది.

ద.మ.రైల్వే జోన్‌ పరిధిలో 62 రైళ్లపై ప్రభావం!

రైల్వేబోర్డు ఆదేశాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆయా రైళ్లపై దృష్టి సారించింది. ప్రయాణదూరం 200 కి.మీ.పైన ఉన్న ప్యాసింజర్‌ రైళ్లు జోన్‌ పరిధిలో 62 ఉన్నాయి. వీటిలో కొన్ని తెలంగాణ పరిధిలో, ఇంకొన్ని తెలుగురాష్ట్రాల మధ్య, మరికొన్ని ఇక్కడి నుంచి కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ 62 ప్యాసింజరు రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చేందుకు పరిశీలిస్తున్నారు. వీటిలో అన్నింటిని మారుస్తారా? ఎంపిక చేసిన వాటినేనా? అనేది కీలకం కానుంది.

లాభనష్టాలేంటి?

ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారిస్తే రైళ్ల వేగం పెరగడంతోపాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇతర రైళ్లు వచ్చినప్పుడు దారి మధ్యలో ఆపడం, ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫారాల కొరత పేరుతో శివార్లలో ఎక్కువసేపు నిలిపివేయడం లాంటి సమస్యలు ఉండవని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

ఛార్జీలు పెరుగుతాయి. సామాన్య ప్రయాణికులపై ఆర్థికభారం. వేగం పెంచడానికి, ఆదాయం లేదన్న కారణంతో కొన్ని చిన్న స్టేషన్లలో స్టాపేజీ ఎత్తేస్తారు. దీంతో ప్రయాణికులు మరో స్టేషన్‌కు వెళ్లి ఎక్కాలి. లేదంటే రోడ్డు ప్రయాణమే.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details