విశాఖలో గ్యాస్ లీక్ ఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సహాయ చర్యల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బాధితులకు సాయం చేయాలని, అండగా నిలవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విశాఖలో గ్యాస్ లీక్పై దిగ్భ్రాంతికి లోనయ్యా: రాహుల్ - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
విశాఖలో గ్యాస్ లీక్ ఘటన పై కాంగ్రాస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. సహాయ చర్యల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
rahul gandhi