విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ దుర్ఘటన హృదయ విదారకమైందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలని కోరారు. విష వాయువు విడుదలై 8 మంది మృతి చెందటం... వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆయన.. ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలని కోరారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ విషయాల్లో మరింత బాధ్యతగా ఉండాలని అన్నారు.