అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంత రైతుల నిరసనలు 94 రోజులకు చేరుకున్నాయి. ఇన్ని రోజులుగా ఉద్యమిస్తున్నా... ముఖ్యమంత్రికి కనీసం జాలి కూడా కలగట్లేదని అన్నదాతలు విలపిస్తున్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణాలైనా త్యాగం చేయటానికి వెనుకాడమంటూ నినదిస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
94వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు - అమరావతి రైతుల నిరసనలపై వార్తుల
అమరావతి రైతుల దీక్షలు 94వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లిలో రైతులు ధర్నా చేస్తున్నారు.
94వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు