ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బైడెన్ అయినా.. భారత్​తో అలాగే ఉంటారు: ప్రొఫెసర్ కృష్ణకుమార్ తుమ్మల

అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా భారత్​తో సంబంధాలు కొనసాగించే విషయంలో పెద్దగా మార్పేమీ ఉండబోదని అమెరికాలో విశిష్ట రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ కృష్ణకుమార్ తుమ్మల అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ కూడా భారత్​తో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన వేళ... ఆయన తన అభిప్రాయాన్ని 'ఈటీవీభారత్'​తో పంచుకున్నారు.

professor krishna kumar views on America presidential elections
professor krishna kumar views on America presidential elections

By

Published : Nov 9, 2020, 1:40 AM IST

జాతీయ ప్రయోజనాల విషయంలో అమెరికా అధ్యక్షులు ఎవరైనా ఒకే విధంగా ప్రవర్తిస్తారని.. అమెరికాలో విశిష్ట రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ కృష్ణకుమార్ తుమ్మల అభిప్రాయపడ్డారు. అమెరికా రాజకీయ, ఆర్థిక, భద్రత విధానాల్లో ఎప్పుడూ పెద్దగా మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. భారత సంబంధాల విషయంలోనూ ఇదే కొనసాగుతుందన్నారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ చైనాను కట్టడి చేసే కోణంలో భారత్​కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. జో బైడెన్ ఆ స్థాయిలో చైనాపై విరుచుకుపడకపోవచ్చని... కానీ చైనాతో స్నేహంగా అయితే మాత్రం ఉండరని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్​తో సంబంధాలకు ప్రాధాన్యతనిస్తారని... నైతికత, ఏకీకృత విధానాలతో ఉండే బైడెన్ నడవడిక... కచ్చితంగా సరైన విధానంలోనే ఉంటుందని ప్రొఫెసర్ కృష్ణకుమార్ తుమ్మల పేర్కొన్నారు.

భారతీయ ఓటర్లలో మార్పు..

అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారతీయ ఓటర్లులోనూ మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతిచ్చే భారతీయ అమెరికన్లు.. ఈసారి ట్రంప్​ను కూడా కాస్త ఆదరించారు. డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన, హ్యూస్టన్​లో జరిగిన.. జరిగిన హౌడీ- మోదీ సభ.. ట్రంప్, మోదీ చిత్రాలతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం వంటివన్నీ కూడా భాజపా ప్రభుత్వం ట్రంప్​నకు బాగా దగ్గర అనే అభిప్రాయం ఆయన మద్దతుదారులకు కలిగించింది. దీంతో అమెరికాలో ఉన్న పరివార్ మద్దతుదారులు మొగ్గు చూపారు. అయితే ఇక్కడ లెక్కలు మాత్రం వేరుగా ఉంటాయి. భారతీయ అమెరికన్లలో ఎక్కువ శాతం డెమోక్రాట్లకు మద్దతు తెలుపుతారు. అమెరికాలో 32 లక్షల మంది భారతీయులు ఉండగా.. అందులో దాదాపుగా 56 శాతం మందికి ఓటు హక్కు ఉంది. వీరిలో మెజారిటీ ఎప్పుడు డెమోక్రాట్ల పక్షాన నిలుస్తారు. 2016లో దాదాపు 80 శాతం మంది హిల్లరీ క్లింటన్​కు ఓటు వేసినట్లుగా అంచనా. తమను తాము "హిందూ అమెరికన్లు" గా భావించుకునే 18 శాతం మంది కిందటిసారి ట్రంప్ వైపు నిలిచారు. ఈసారి ఆ సంఖ్య మరికాస్త పెరిగింది. అయితే డెమోక్రాట్లు కమల హరీస్​ను ఉపాధ్యక్షురాలిగా బరిలోకి దింపడం వారికి కలిసొచ్చింది. ఆమె తనను తాను నల్లజాతీయురాలిగా చెప్పుకోవడం, తన భారత మూలాల గురించి ప్రస్తావించడం బాగానే పనిచేసింది. కొన్నిచోట్ల ఆమె తమిళ పదాలతో తమ బంధువులను పలకరించడం.. తమిళ వర్గాలను బాగా ఆకట్టుకుంది. హరీస్ ప్రభావంతో ఈసారి కూడా డెమోక్రాట్లు దాదాపు 70 శాతం వరకు భారతీయుల ఓట్లను పొందగలిగారు.- ప్రొఫెసర్ కృష్ణకుమార్ తుమ్మల

ABOUT THE AUTHOR

...view details