రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటును పునర్నిర్వచిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బోర్డులో ప్రభుత్వం నామినేట్ చేసే ఛైర్మన్ సహా ఆరుగురు అధికారులు ఉండనున్నారు. నైపుణ్యాభివృద్ధి బోర్డులో ప్రైవేటు భాగస్వామ్యాల నుంచి నలుగురు సభ్యులు ఉంటారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, పెట్టుబడులు, పరిశ్రమల విభాగం సీఈవో, ఉపాధి శిక్షణ కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సభ్యులుగా ఉండనున్నారు. బోర్డు సభ్యుడిగా కళాశాల విద్య డైరెక్టర్ వ్యవహరించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీలను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
'నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటు' - నైపుణ్యాభివృద్ధి సంస్థ
నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటును పునర్నిర్వచిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు భాగస్వామ్యాల నుంచి నలుగురు... ప్రభుత్వం నామినేట్ చేసే ఛైర్మన్ సహా ఆరుగురు అధికారులు ఉండనున్నారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు ఏర్పాటు