ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోజుకు 16 వేల సర్వే రాళ్ల తయారీ - Ap

భూముల రీ సర్వేకు ష్ట్రవ్యాప్తంగా కోటి రాళ్లు అవసరం అవుతాయని సర్వే శాఖ, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు తెలిపింది. సర్వేకు అవసరమైన గ్రానైట్‌ రాళ్లను రోజుకు 16 వేల చొప్పున సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిపై 'వైఎస్‌ఆర్‌ జగనన్న భూరక్ష-2020' అని పథకం పేరు, సరిహద్దు తెలిపే చిహ్నం చెక్కనున్నారు.

వైఎస్‌ఆర్‌ జగనన్న భూరక్ష-2020
వైఎస్‌ఆర్‌ జగనన్న భూరక్ష-2020

By

Published : Jul 15, 2021, 8:02 AM IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేకు అవసరమైన గ్రానైట్‌ రాళ్లను రోజుకు 16 వేల చొప్పున సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి రాళ్లు అవసరం అవుతాయని సర్వే శాఖ, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు తెలియజేసింది.

అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో యూనిట్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాళ్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు చోట్ల యూనిట్ల ఏర్పాటుకు ఇటీవల ఏపీఎండీసీ టెండర్లు పిలిచింది.

రెండు రకాల రాళ్లను ఉపయోగించనున్నారు. ఎ-క్లాస్‌ రాళ్లు ఒక్కోటి కనీసం 70 కిలోల బరువు, 90 సెంటీమీటర్ల పొడవు ఉండనున్నాయి. బి-క్లాస్‌ రాళ్లు 45 కిలోల బరువు, 60 సెంమీ పొడవు ఉండనున్నాయి. వీటిపై 'వైఎస్‌ఆర్‌ జగనన్న భూరక్ష-2020' అని పథకం పేరు, సరిహద్దు తెలిపే చిహ్నం చెక్కనున్నారు. ప్రసుత్తం రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 రెవెన్యూ డివిజన్లలోని 51 గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వేకు అవసరమైన రాళ్లను ఏపీఎండీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు.

ఇదీ చదవండి:polavaram: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!

ABOUT THE AUTHOR

...view details