కోహెడకు చెందిన సటికం భాగ్య, మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో ఆదివారం జరిగింది. వధూవరులు వివాహ వేదికపై ఉంటే... పురోహితుడు ప్రసాద్ రావు శర్మ మాత్రం మండపానికి వచ్చి అదే కారులో కూర్చున్నాడు. ఆ కారులో నుంచే వధూవరులను చూస్తూ... మైక్‌లో మంత్రాలు చదువుతూ వివాహం జరిపించారు. అటో ఇటో... తంతగాన్ని మొత్తం కారులో నుంచే పూర్తి చేశాడు ఆ పంతులు.
కారులోనే పెళ్లి తంతు పూర్తి .. వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్! - కోహెడలో పెళ్లి
కరోనా వేళ కొన్ని చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమయంలో జరుతున్న కొన్ని పెళ్లిళ్లు వైరల్ అవుతున్నాయి. ఆన్లైన్ పెళ్లి, మొబైల్ పెళ్లి అంటూ పలు వివాహాలు వార్తల్లో నిలువగా... పురోహితుని పుణ్యమా అని ఇప్పుడు ఇంకో కల్యాణం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరే చూసేయండి...!
priest in car
ఈ తతంగాన్ని మొత్తం అక్కడున్న వారు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా... ఇప్పుడు ఆ పెళ్లి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కరోనా భయంతో పలుచోట్ల పురోహితులు మండపానికి దూరంగా ఉంటూ... వివాహాన్ని జరిపిస్తున్నారు.