COMPLAINT ON ROADS : రాజధాని అమరావతి పరిధిలో రహదారుల విధ్వంసం, మట్టి, కంకర చోరీ ఘటనలపై.. పోలీసులకు ఫిర్యాదు అందింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం సమీపంలో E-9 రహదారిని గుర్తుతెలియని వ్యక్తులు.. 250 మీటర్ల పొడవు మేర తవ్వేశారు. తారు రోడ్డును తవ్వేసి.. మట్టి, కంకర దోచుకెళ్లారు. ఈ విషయంపై.. రహదారి నిర్మాణ సంస్థ.. మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు.. మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్లు తవ్వినవారిపై చర్యలు తీసుకోవాలని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. మంగళగిరి మండలం నీరుకొండ వద్ద నిర్మిస్తున్న వంతెన వద్ద కూడా కంకర తరలించినట్లు స్థానిక వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపైనా విచారణ చేస్తున్నట్లు.. మంగళగిరి గ్రామీణ పోలీసులు వెల్లడించారు.
రాజధానిలో మట్టి, కంకర చోరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ - మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు
COMPLAINT ON ROADS EXCAVATION : రాజధాని పరిధిలో మట్టి, కంకర చోరీ ఘటనలపై.. పోలీసులకు ఫిర్యాదు అందింది. కంకర చోరీ ఘటనపై మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు.. మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
COMPLAINT ON ROADS EXCAVATION