ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెలగపూడిలో కలకలం... రైతుల ఇళ్లల్లోకి పోలీసులు!

'పోలీసులకు లాఠీలు బదులు గన్​లు ఇచ్చి పంపించండి. కనిపించిన వాళ్లందరిని కాల్చివేయండి. శ్మశానం మీద ఏలుకోండి' ఇది వెలగపూడిలోని ఓ మహిళ ఆవేదన. వెలగపూడిలో పోలీసుల అరెస్టులు, తనిఖీలతో రైతు కుటుంబాల మహిళలు వణికిపోయారు. రోజూ హింసించే బదులు ఒకేసారి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Police entered into the homes of the farmers in Velagapudi
Police entered into the homes of the farmers in Velagapudi

By

Published : Jan 11, 2020, 6:32 PM IST

రైతుల ఇళ్లల్లోకి పోలీసులు.. మహిళల ఆందోళన!

అమరావతిలోని వెలగపూడిలో పోలీసుల అరెస్టులు, తనిఖీలతో రైతు కుటుంబాల మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజధాని ఘటనల్లో నిందితుల కోసమంటూ పోలీసులు ఇళ్లల్లోకి రాగా... వారెంట్‌ ఏదంటూ మహిళలు పోలీసులు వాగ్వాదానికి దిగారు. అయితే పెద్దసంఖ్యలో ఇళ్లల్లోకి ప్రవేశించిన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేసి పలువురిని తమతో పాటు తీసుకెళ్లారు. వైకాపాకు ఓట్లేసి నెత్తిన కుంపటి పెట్టుకున్నామంటూ పలువురు మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. హింసించే బదులు తమని ఒకేసారి చంపేస్తే ఆందోళనలు ఉండవని కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details