ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 11, 2020, 9:46 AM IST

Updated : Jan 11, 2020, 10:11 AM IST

ETV Bharat / city

కులం చెబితే కేసులు ఉండవా!

అమరావతి ఉద్యమంలో అరెస్టైన మహిళలకు ఓ వింత అనుభవం ఎదురైంది... పోలీసులు కులం గురించి వివరాలు అడగడగానే ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అంశంపై మహిళలు పోలీసులను వ్యతిరేకించారు.

police asking amaravthi about their caste
వింతగా అమరావతి మహిళల విచారణ

మీది ఏ ఊరు..?... మీరే పార్టీ...?... మీదే కులం..?... ఇదీ అమరావతి ఉద్యమంలో అరెస్టైన మహిళలను పోలీసులు విచారించే విధానం. . కృష్ణలంక స్టేషన్‌లో ఇతర వివరాలతో పాటు కులం పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు. ఫొటోలు కూడా తీసుకోవడంతో.. వారు వ్యతిరేకించారు. తాము దొంగలమా.. దోపిడీదారులమా ఫొటోలు ఎందుకంటూ మహిళలు ఎదురుతిరిగారు. రాత్రి 7.30 గంటలకు తెదేపా నేతలు, అమరావతి ఐకాస నేతలు వచ్చినా వారిని పోలీసులు విడుదల చేయలేదు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అక్కడికి వెళ్లి పోలీసులతో మాట్లాడగా.. ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు విడుదల చేశారు. నున్న పోలీస్‌స్టేషన్‌లోనూ సాయంత్రం 6 గంటలయినా మహిళలను విడిచిపెట్టలేదని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

కులం పేరతో పోలీసులు విచారణ
Last Updated : Jan 11, 2020, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details