ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థిని గొంతుకోసిన ఉన్మాది అరెస్టు.. - విద్యార్థినిపై కత్తిలో దాడి

ARRESTED ACCUSED: తెలంగాణలోని హనుమకొండలో విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాదిని పోలీసులు పట్టుకున్నారు. ఘటన జరిగి 24 గంటల్లోనే ఉన్మాది అజార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

accused arrest in student assault case
తెలంగాణలో విద్యార్థినిపై కత్తిలో దాడి

By

Published : Apr 22, 2022, 6:54 PM IST

తెలంగాణలోని హనుమకొండలో విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాది అజహర్​ను అరెస్ట్​ చేసి విచారణ చేపట్టారు. తనను ప్రేమించాలంటూ ఇవాళ ఉదయం ప్రేమోన్మాది అజహర్​ విద్యార్థిని(23)పై కత్తితో గొంతు కోసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ విద్యార్థిని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదువుతోంది.

అసలేం జరిగిందంటే:పట్టపగలు విద్యార్థిని ఇంట్లోకి చొరబడిన ఉన్మాది.. ఆమె గొంతుకోసి పారిపోయాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని లక్నేపల్లికి చెందిన విద్యార్థిని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఐ చివరి సంవత్సరం చదువుతూ. పోటీపరీక్షలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ గాంధీనగర్‌ కాలనీలో నివాసముంటుంది. కాగా ప్రిపరేషన్‌ కోసం కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన యువతి.. నిన్న సాయంత్రం హనుమకొండకు తిరిగివచ్చింది.

వరంగల్‌ జిల్లా సంగెం మండలం ముండ్రాయికి చెందిన అజహర్‌.. గత కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గురువారం ఆమె ఇంటికి వచ్చిన విషయం తెలుసుకుని.. గాంధీనగర్‌లోని ఇంటి వద్ద ద్విచక్రవాహనంపై తిరిగాడు. కాగా రేపటి నుంచి కేయూలో పరీక్షలు ఉండటంతో ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించి ఆమె స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఇంట్లో ఉన్న యువతి తల్లి.. పక్కింటికి వెళ్లిన సమయాన్ని అదునుగా చూసిన కిరాతకుడు ఫోన్‌ సంభాషణలో ఉన్న విద్యార్థినిపై దాడిచేశాడు. తాను వెంట తీసుకొచ్చిన కత్తితో ఆమె గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్‌లో కేకలు విన్న స్నేహితులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వటంతో ఘటన విషయం అందరికీ తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారైన నిందితుడిని పట్టుకుని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

crime news

ABOUT THE AUTHOR

...view details