Platform Ticket Price:సంక్రాంతి పర్వదినం సందర్బంగా తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతుంది. ప్రయాణికులతో పాటు వాళ్ల బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. పెంచిన ధరలు ఈనెల 20వ తేదీ వరకు అమలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ వెల్లడించారు.
Platform Ticket Price: భారీగా పెరిగిన.. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలు! - సికింద్రాబాద్ రైల్వే వార్తలు
Platform Ticket Price: తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలోనే.. ఈ ధరలు పెంచామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ ఫ్లాట్ ఫాం ధర రూ.10 నుంచి రూ.50 వరకు పెంచామని సీపీఆర్ఓ అన్నారు. హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల, భధ్రాచలంరోడ్, వికారాబాద్, తాండూర్, బీదర్, పర్లివైజ్ఞాత్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఫ్లాంట్ ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచామన్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ చదవండి :CBN on NTR oath day : ఆ ఘనత సాధించిన.. ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ : చంద్రబాబు