సాయం చేసేటప్పుడు భౌతికదూరం పాటించాలి: డీజీపీ - Physical distance should be practiced
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలు, ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న దాతలు... కచ్చితంగా భౌతికదూరం పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలు, ఆహార పొట్లాలు, తదితరాలు పంపిణీ చేస్తున్న దాతలు కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కచ్చితంగా భౌతికదూరం పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. ప్రజలు ఒకేచోట గూమిగుడటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశముంటుందని వివరించారు. లాక్డౌన్ స్ఫూర్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. నిత్యావసర సరకులు పంపిణీ చేయాటానికి ప్రభుత్వమే పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. దాతలు ఎవరైనా సరే మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాకే పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు.