ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి టౌన్​ బ్యాంకు ఎన్నికను రద్దు చేయండి:హైకోర్టులో వ్యాజ్యం

తిరుపతి టౌన్‌ బ్యాంక్​ మేనేజింగ్‌ కమిటీ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

High Court
హైకోర్టు

By

Published : Jul 28, 2022, 8:33 AM IST

ఈ ఏడాది జూన్‌ 20న అప్రజాస్వామికంగా జరిగిన తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ (తిరుపతి కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌) మేనేజింగ్‌ కమిటీ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సహకారశాఖ ముఖ్య కార్యదర్శి, కో ఆపరేటివ్‌ సొసైటీల కమిషనర్‌, తిరుపతి జిల్లా కలెక్టర్‌/ఎన్నికల అథార్టీ, తిరుపతి జిల్లా కోఆపరేటివ్‌ అధికారి, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ, తిరుపతి తూర్పు ఠాణా ఎస్‌హెచ్‌వో తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. వైకాపా నేతల కనుసన్నల్లో అక్రమాల నడుమ జరిగిన తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికలను రద్దు చేసి, రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ కంకణాల రజనీకాంత్‌నాయుడు, మరో 11 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాలపై విచారణ జరిపి, హైకోర్టుకు నివేదిక ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details