ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ కష్టాలు: పొట్టకూటి కోసం గాంధీ వేషధారణ

పొట్ట కూటి కోసం గాంధీ వేషధారణను నమ్ముకునే వారిని చాలా ఎళ్లుగా చూస్తూనే వస్తున్నాం. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్న తరహలో కొవిడ్ సంక్షోభంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబానికీ.. మహాత్ముడే దిక్కయ్యాడు. భిక్షాటనతో వచ్చే సొమ్ముతోనే.. ప్రస్తుత పరిస్థితుల్లో పూట గడుస్తోందంటున్నాడు తెలంగాణలోని భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.

a man begging in mahatma gandhi dressing
పొట్టకూటి కోసం గాంధీ వేషధారణ

By

Published : May 12, 2021, 8:07 PM IST

తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన సంతోష్ రెడ్డి.. గాంధీ వేషంతో పొట్ట నింపుకొంటున్నాడు. సిల్వర్ పెయింట్‌ను ఒంటికి పూసుకుని భగభగ మండే ఎండలో భిక్షాటన చేస్తూ భార్య, కూతుళ్లను పోషించుకుంటున్నాడు. ఉపాధి కోసం 10 సంవత్సరాల క్రితం జిల్లాకు వచ్చిన తనకు.. ప్రస్తుతం ఏ దారీ లేక.. మహాత్ముడి వేషంతో బతుకుదెరువు కొసాగిస్తున్నట్లు తెలిపాడు.

"కరోనా సంక్షోభానికి ముందు ఓ హోటల్​లో పని చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. లాక్​డౌన్​లో ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దురదృష్టవశాత్తు.. ప్రమాదంలో కాలికి గాయమైంది. చేసేదేమీ లేక.. గాంధీ వేషధారణతో భిక్షాటన చేస్తున్నాను. ఆ వచ్చే డబ్బుతో పూట గడుస్తోంది" - సంతోష్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details