PERNI NANI COMMENTS ON RGV: దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్వీట్లపై మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టికెట్ల విషయంపై ప్రభత్వం ఎలా జోక్యం చేసుకుంటుందన్న వర్మ ప్రశ్నకు100 రూపాయల టికెట్‌ను వెయ్యికి, 2 వేలకు అమ్మొచ్చని ఏ చట్టం చెప్పిందని పేర్ని నాని ట్వీట్ చేశారు. ఇలా చేయడాన్ని ఏ తరహా మార్కెట్ మెకానిజం అంటారని ప్రశ్నించారు. డిమాండ్, సప్లయ్ అంటారా....లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అని నిలదీశారు. సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
66 ఏళ్లుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయని స్పష్టం చేశారు. వర్మ నిత్యావసరాల ధరల్నే ప్రభుత్వం నియంత్రించవచ్చని సూచించారన్న పేర్ని... సినిమా థియేటర్లు ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలని బదులిచ్చారు. బలవంతంగా ధరలు తగ్గిస్తే ప్రోత్సాహం తగ్గేది కొనేవారికా....లేక అమ్మేవారికా? అని ప్రశ్నించారు.