ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ తీర్మాణం
బ్యాంకింగేతర కార్యకలాపాల కోసం ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలనుకుంటోంది. దీనికోసం ఏర్పాటు చేసే గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు రూ.40 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఉద్యానపంటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పేర్నినాని