రాజధానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్... రైతులు, కూలీలతో మాట్లాడారు. రాజధాని నిర్మాణ పనులు పరిశీలించారు. వేల కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన తర్వాత... రాజధాని తరలింపు అంటూ ప్రకటనలు చేయడం సరికాదన్నారు. రాజధాని విషయంలో తాను మొదటి నుంచి ప్రజల పక్షానే నిలబడ్డానన్న జనసేనాని... ఇప్పుడు కూడా ప్రజల తరఫునే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటానంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'
రాజధాని విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు... భూములిచ్చిన రైతులకు ఆందోళన కలిగించే ప్రకటనలు చేయొద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
రాజధాని నిర్మాణ పనులు పరిశీలించిన పవన్