ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిసెంబరు 1 నుంచి సీమ జిల్లాలో పవన్ పర్యటన - సీమలో పవన్ పర్యటన వార్తలు

డిసెంబర్ 1 నుంచి 6 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పర్యటించనున్నారు.

pawan-kalyan-rayalaseema-tour-confirm
pawan-kalyan-rayalaseema-tour-confirm

By

Published : Nov 26, 2019, 5:36 PM IST

డిసెంబరు 1 నుంచి సీమ జిల్లాలో పవన్ పర్యటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 6 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్‌ పర్యటించనున్నారు. రైతులు, మేధావులను కలసి పలు అంశాలపై చర్చించనున్నారు. అపరిష్కృత సమస్యలు, మౌలిక సదుపాయాల లేమి కారణంగా బాధపడుతున్న ప్రజలతో మాట్లాడనున్నారు. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో... జనసేన అభ్యర్థులు, నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్రమ కేసులకు గురవుతున్న... జనసేన నాయకులు, శ్రేణులతో మాట్లాడి పవన్‌ భరోసా కల్పిస్తారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details